Crimejournalist

Feb 21 2024, 08:25

గజ్వేల్ ఏసిపి బాలాజీ ని కలిసి తమ సమస్యలు చెప్పి సన్మానించిన ఆటో యూనియన్ ప్రెసిడెంట్, కార్యవర్గ సభ్యులు

సిద్దిపేట జిల్లా:

Street Buzz Crime journalist:


(గజ్వేల్ 20- ఫిబ్రవరి):- ప్రజ్ఞాపూర్ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ మరియు కార్యవర్గ సభ్యులు మంగళవారం కలసి గజ్వేల్ ఏసిపి బాలాజీ ని ఏసీపీ కార్యాలయంలో కలసి వారిని సన్మానించారు. అనంతరం వారి యొక్క సమస్యలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ బాలాజీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సామరస్యంగా ఆటో డ్రైవర్ల సమస్యను పరిష్కరించడం జరుగుతుందన్నారు.

Crimejournalist

Feb 21 2024, 08:01

రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 150మంది విద్యార్థినులకు సైకిల్లు పంపిణీ


streebuzz crime journalist




సిద్దిపేట జిల్లా:



(ములుగు 20-పిబ్రవరి): - సిద్దిపేట జిల్లా ములుగు మండలం వంటిమామిడి లో 150 మంది విద్యార్థినులకు రోటరీ క్లబ్ గజ్వేల్ ఆధ్వర్యం లో సైకిళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గజ్వేల్ ఎసిపి బాలాజీ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక సేవలో రోటరీ క్లబ్ సేవలు ప్రశంసనీయం అని ఈ సంస్థ ద్వారా విద్యార్థినులకు 150 సైకిళ్లను ఉచితంగా పంపిణీ చేయడం అభినందనీయం అని ఆయన కొనియడారు.విద్యార్థినిలు అసాంఘిక శక్తుల నుండి అప్రమత్తంగా ఉండాలని,మంచి చదువులు చదివి ఉన్నత శిఖరాలకు చేరకోవాలనీ ఎసిపి బాలాజీ అన్నారు. రోటరీ క్లబ్ రీజియన్ హెడ్ రవి వడ్లమను మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో రోటరీ క్లబ్ ద్వారా మరింత సేవలు చేయాల్సిన అవసరం ఉందని, గజ్వేల్ రోటరీ క్లబ్ ద్వారా విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం అభినందనీయం అని రవి వడ్లమని అన్నారు.ఈ కార్యక్రమం లో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థినులు , గజ్వేల్ రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

Crimejournalist

Feb 20 2024, 08:46

ప్రశాంతంగా ముగిసిన ఛత్రపతి శివాజీ జయంతి ర్యాలీ







Streetbuzz News Crime journalist


సిద్దిపేట జిల్లా:



(గజ్వేల్ 19-పిబ్రవరి ):- గజ్వేల్ చత్రపతి శివాజీ జయంతి సందర్భంగా సోమవారం గజ్వేల్ పట్టణంలో నిర్వహించిన ర్యాలీ కి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీస్ అధికారులు, మరియు సీసీ కెమెరాల నిఘా ద్వారా పర్యవేక్షించిన అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ యస్. మల్లారెడ్డి, గజ్వేల్ ఏసిపి బాలాజీ, ర్యాలీ గజ్వేల్ రామాలయం టెంపుల్ నుండి మార్కెట్ హనుమాన్ టెంపుల్, ఇందిరా పార్క్, బస్టాండ్, అంబేద్కర్ స్టాచ్, పిడిచెడు రోడ్డు శివాజీ విగ్రహం వరకు కొనసాగింది. ప్రశాంతంగా ముగిసిన ర్యాలీ.పర్యవేక్షించిన పోలీస్ అధికారులు అడిషనల్ డిసిపి లాండ్ ఆర్డర్ ఎస్ మల్లారెడ్డి, గజ్వేల్ ఏసిపి బాలాజీ, గజ్వేల్ ఇన్స్పెక్టర్ సైదా, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మురళి, రూరల్ సీఐ మహేందర్ రెడ్డి, తొగుట సిఐ లతీఫ్, ఎస్ఐలు పోలీస్ సిబ్బంది.

Crimejournalist

Feb 20 2024, 08:25

అన్నపూర్ణ నీటిని విడుదల చేయాలి బిక్కవాగు బ్రిడ్జిపై ధర్నా



Streetbuzz News Crime journalist

రాజన్నసిరిసిల్ల జిల్లా:


అన్నపూర్ణ నీటిని విడుదల చేయాలి బిక్కవాగు బ్రిడ్జిపై ధర్నా వివరాల్లోకి వెళితే రాజన్న సిరిసిల్ల జిల్లా అనంతగిరి శివారులోని అన్నపూర్ణ రిజర్వాయర్‌ నుంచి బిక్కవాగుకు నీటిని విడుదల చేయాలనీ ఆందోళనకు దిగారు. సోమవారం ఇల్లంతకుంటలోని బిక్కవాగు బ్రిడ్జిపై బైఠాయించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నీరందక యాసంగి పంటలు ఎండిపోతున్నాయని అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.వెంటనే కాంగ్రెస్‌ సర్కారు స్పందించి నీటి విడుదలకు చర్యలు చేపట్టాలని కోరారు. నిరుడు ఎండకాలంలో అప్పటి ప్రభుత్వం అన్నపూర్ణ రిజర్వాయర్‌కు కాళేశ్వరం జలాలను తరలించి పంటలను కాపాడిందని, కాంగ్రెస్‌ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని మండిపడ్డారు.

Crimejournalist

Feb 20 2024, 08:12

ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్‌ కౌన్సిలర్ల తన్నులాట పెద్దపల్లిలో కౌన్సిలర్ల అనుచరుల రణరంగం



•ఎమ్మెల్యే విజయరమణారావుకు చేదు అనుభవం•


Streetbuzz News Crime journalist


పెద్దపల్లి జిల్లా:




(పెద్దపల్లి 19- ఫిబ్రవరి ) :- పెద్దపల్లి కాంగ్రెస్‌లో విభేదాలు భగ్గుమన్నాయి. పెద్దపల్లి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారి మున్సిపల్‌ బడ్జెట్‌ సమావేశానికి వచ్చిన చింతకుంట విజయరమణారావుకు చేదు అనుభవం ఎదురైంది. ఎమ్మెల్యే ఎదుటే కాంగ్రెస్‌ కౌన్సిలర్లు ఇద్దరు పరస్పరం తోసుకోగా, కార్యకర్తలు పిడిగుద్దులు గుద్దుకున్నారు. పెద్దపల్లి మున్సిపాలిటీ కొనుగోలు చేసిన రెండు ట్రాక్టర్లను సోమవారం ప్రారంభించేందుకు ఎమ్మెల్యే వచ్చారు. కొబ్బరి కాయలు కొట్టే క్రమంలో కౌన్సిలర్లు కొలిపాక శ్రీనివాస్‌, నూగిళ్ల మల్లయ్య మధ్య తోపులాట జరిగింది. దీంతో మల్లయ్య.శ్రీనివాస్‌ను పక్కకు జరుగమనడంతో ఇద్దరిమధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. పోలీసులు వారిని నిలువరించడంతో ఎమ్మెల్యే ట్రాక్టర్లను ప్రారంభించారు. అనంతరం బడ్జెట్‌ సమావేశం జరుగుతున్న సమయంలో కౌన్సిలర్ల అనుచరులు అక్కడికి చేరుకున్నారు. సమావేశ మందిరం లోకి వెళ్లి కొట్టుకున్నారు. ఎమ్మెల్యేతోపాటు కౌన్సిలర్‌ శ్రీనివాస్‌ బయటకు వచ్చి నూగిళ్ల మల్లయ్య అనుచరులు దాడి చేశారని ఆరోపించారు. ముదిరాజ్‌లను మున్నూరు కాపులు అణగదొక్కుతున్నారని శ్రీనివాస్‌ మండిపడ్డారు. గొడవ జరగుతుండగానే ఎమ్మెల్యే అక్కడినుంచి వెళ్లిపోయారు. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి అక్కడినుంచి పంపించారు. కౌన్సిలర్లు శ్రీనివాస్‌, మల్లయ్య పరస్పరం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు.

Crimejournalist

Feb 20 2024, 07:43

గ్రామ పంచాయతీ ఎదుట ఖాళీ బిందెలతో నిరసన వారానికోసారి సన్నగా వస్తున్నాయని ఆవేదన
తాగునీటి కోసం మహిళల ఆందోళన


పంచాయతీ ఎదుట ఖాళీ బిందెలతో నిరసన వారానికోసారి సన్నగా వస్తున్నాయని


Streetbuzz News Crime journalist


కరీంనగర్‌ జిల్లా :

(చిగురుమామిడి ):- మండలంలోని సుందరగిరి గ్రామంలో తాగునీటి కోసం మహిళలు గ్రామ పంచాయితీ కార్యాలయం ఎదుట సోమవారం ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు. తమకు వారం రోజులకు ఒకసారి తాగునీటిని సరఫరా చేస్తున్నారని, అదికూడా సన్నగా వస్తున్నదని, దీనివల్ల చాలా రోజులుగా నీటి కోసం ఇబ్బందులు ఎదురొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.పలుమార్లు గ్రామపంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ప్రయోజనం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి కోసం చాలా దూరం వెళ్లాల్సివస్తున్నదని మండిపడ్డారు. ఈ విషయాన్ని గ్రామ ప్రత్యేకాధికారి, తహసీల్దార్‌ ఇప్ప నరేందర్‌ దృష్టికి తీసుకెళ్లగా సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిషరిస్తారని హామీ ఇచ్చారు.

Crimejournalist

Feb 20 2024, 07:04

పిల్లలమ మార్పు కేవలం ఉపాద్యాయులతోనే జరుగుతుంది - . సబ్ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆలమూరు





ఆలమూరు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీను నాయక్   తల్లిదండ్రులకు చేతులు జోడించి నమస్కరించి చేసుకుంటున్న విన్నపం


వరంగల్ జిల్లా:

Streetbuzz News Crime journalist


(ఆలమూరు):-  ఆలమూరు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీను నాయక్  తల్లిదండ్రులకు చేసుకుంటున్న విన్నపం ఏమనగా  క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే పాఠశాలల్లో విద్యార్థుల హెయిర్ స్టైల్ పై, వారి నడవడికపై ఎన్నిసార్లు హెచ్చరించినా, వారిప్రవర్తనలో మార్పు రావడం లేదు. ఉపాధ్యాయులు చూస్తూ, ఏమిచేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటున్నారు. తల్లిదండ్రులకు తమ పిల్లలపై శ్రద్ద, నియంత్రణ లేకపోతే ఇలానే తయారవుతారు. క్రమశిక్షణ మాటలతో రాదు. కొద్దిపాటి దండన, భయభక్తులు ఉంటేనే వస్తుంది. పిల్లలకి బడిలో భయంలేదు. ఇంట్లో భయం లేదు. అందుచేతనే సమాజం ఈరోజు భయభ్రాంతులకి గురి అవుతున్నది. వాళ్ళే ఈ రోజుల్లో రౌడీలుగా తిరుగుతున్నారు. అభం శుభం తెలియని వాళ్ళని పొట్టన పెట్టుకుంటున్నారు. ఆ తర్వాత పోలీసు వారి చేతుల్లో పడి కోర్టులలో శిక్షలకి గురవుతున్నారు. గురువుని గౌరవించని సమాజం వినాశకాలానికి గురవుతుంది.ఇది నిజం. గురువంటే భయం లేదు మరియు గౌరవం లేదు. ఇక చదువు, సంస్కారం ఎట్లా వస్తుంది*? కొట్టొద్దు!తిట్టొద్దు! బడికి రానివాడ్ని ఎందుకు రావట్లేవు అని అడగొద్దు! చదవాలని, హోమ్ వర్క్ అని, కొట్టినా తిట్టినా టీచర్లదే తప్పు, 5వ తరగతి నుండే కటింగు స్టైలు, చినిగిన జీన్స్ గోడల మీద కూర్చోవడం. వెళ్ళే వారిని వచ్చే వారిని కామెంట్స్ చేయడం. అరేయ్ సార్ వస్తున్నారురా! అని అంటే, వస్తే రానియ్ అనే పరిస్తితి. దరిద్రం ఏంటంటే, కొంతమంది తల్లి దండ్రులే మావాడు చదవకున్నా ఏమి కాదు, మావాడిని మాత్రం కొట్టవద్దు ఆలమూరు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీను నాయక్. ఇంకొక విషయం ఏమిటంటే ఎవరు బాబు నీకు కటింగ్ చేయించినది అంటే మా నాన్న సార్ అంటున్నారు. పెన్ను ఉంటే పుస్తకం ఉండదు, పుస్తకం వుంటే పెన్ను వుండదు. కొనరు, తెచ్చుకోరు. భయం ఉండాలని రెండు దెబ్బలు వేద్దామంటే ఎటునుంచి పోయి ఎటువస్తాదో అని భయం. ఇవన్నీ చూస్తుంటే పిల్లల కంటే సార్లకే భయం ఎక్కువగా వుంది. కొట్టకుండా, తిట్టకుండా, భయం లేకుండా చదువు వస్తుందా...? భయం లేని కోడి బజారులో గుడ్డు పెట్టిందంట! అలానే ఉంది నేటి పిల్లల వ్యవహారం. స్కూల్లో తప్పుచేసినా కొట్టకూడదు, తిట్ట కూడదు, కనీసం మందలించ కూడదు ప్రేమతో చెప్పాలట. ఇదెలా సాధ్యమ్? మరి సమాజం ఎందుకు అలా చేయదు? మొదటి తప్పేకదా అని ఊరుకుంటుందా? మంచి నేర్పేవాళ్ళకి (స్కూల్లో) హక్కులుండవు. ప్రవర్తన మార్చుకో అని టీచర్ చిన్నప్పుడే కొడితే నేరం. వాడు పెద్దయ్యాక అదే తప్పు చేస్తే మరణం. తల్లిదండ్రులకు నా మనవి. పిల్లల్లో మార్పు కేవలం ఉపాధ్యాయుల తోనే జరుగుతుంది. ఎక్కడో ఒకటో అరో ఒకరిద్దరు టీచర్లు చేసిన తప్పులకు, అందరి ఉపాధ్యాయులకు ఆపాదించవద్దు. 90 శాతం టీచర్లు పిల్లలు బాగుండాలనే వ్యవహరిస్తారు. ఇది యదార్ధం. ఇకనైనా ప్రతీ చిన్న విషయానికి టీచర్లను నిందించవలదు. మేము చదువుకునే రోజుల్లో కొంతమంది టీచర్లు మమ్మల్ని కొట్టేవారు. అయినా ఏనాడు మా పేరెంట్స్ వచ్చి టీచర్లను నిలదీయలేదు. మా బాగు కోసమే అని అనుకునేవారు. ముందుగా తల్లి దండ్రులు టీచర్ అంటే గౌరవం, భయం ఉండేటట్లు పిల్లలకు మానసిక తర్ఫీదు ఇవ్వాలని మనవి. తల్లి తండ్రులు ఒక్కసారి మీ పిల్లల భవిషత్ పై ఆలోచించండి.పిల్లలు చెడిపోవడానికి స్నేహితులు, ఫోన్లు, మీడియా 60 % , కానీ 40% మాత్రం తల్లి దండ్రులే..పిల్లల్ని గారాబం శృతిమించితే మొత్తానికే నష్టం వస్తుంది.. పిల్లల పట్ల మనం పాటిస్తున్న అజ్ఞానం, మూఢ నమ్మకాలు, స్వార్థం, అతి ప్రేమ వారిని చాలా వరకు బద్దకస్తుల్ని చేస్తూ వారిని నాశనం చేస్తున్నారు.ఇప్పుటి తరం 70% పిల్లలు.తల్లిదండ్రులు కారు, బండి శుభ్రం మంటే తుడవరు. మంచి నీళ్ళు, పాలు, కిరాణా సరుకుల కోసం బయటికి వెళ్ళమంటే వెళ్లరు. లంచ్ బ్యాగ్ లు, స్కూల్ బ్యాగులు శుభ్రం చేసుకోరు. కనీసం ఇంటి దగ్గర చిన్న చిన్న పనులలో సహాయం చేయరు. రాత్రి 10 గంటలలోపు పడుకుని, ఉదయం 6 లేదా 7 గంటలలోపు నిద్ర లేవరు. గట్టిగా మాట్లాడితే ఎదురు తిరగబడి సమాధానం చెబుతారు. తిడితే వస్తువులను విసిరి కొడతారు. ఎప్పుడయినా దాచుకోమని డబ్బులు ఇస్తే మనకు తెలియకుండా ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ , నూడుల్స్, ఫ్రెండ్స్ కి పార్టీలు, ఫ్రెండ్స్ కోసం గిఫ్ట్ లు కొనుగోలు చేస్తున్నారు. మైనర్ పిల్లలకి బైక్లు ఇవ్వడం వారు ఆక్సిడెంట్లకు చేయడం కేసులలో ఇరుక్కోవడం,ఆడపిల్లలు అయితే తిన్న కంచం కూడా కడగటం లేదు. ఇల్లు ఊడ్చమంటే కోపాలు వచ్చేస్తున్నాయి. అతిథులు వస్తే కనీసం గ్లాసేడు మంచి నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచనలేని అమ్మాయిలు కూడా ఉన్నారు. 20 సంవత్సరాలు దాటినా చాలామంది ఆడపిల్లలకు వంట చేయడం రాదు. బట్టలు పద్ధతిగా ఉండాలంటే ఎక్కడలేని కోపం వీరికి. కల్చర్, ట్రెండ్, టెక్నాలజీ పేరిట వింత పోకడలు. వారిస్తే వెర్రి పనులు. మనమే పిల్లలచేత అవన్నీ చేయించడం లేదు. పై వాటికి కారణం మనమే. ఎందుకంటే మనకు అహం,పరువు మరియు ప్రతిష్టలు అడ్డొస్తున్నాయి. చూసేవాళ్లకు మనం మంచి హోదాలో ఉండాలి. రిచ్ లుక్, స్టేటస్ మెయింటైన్ చేయాలి అని భ్రమలో ఉన్నాం. గారాబంతో పెరిగిన వారు మధ్యలో మారమంటే మారడం అస్సలు జరగదు.. వారిని కష్ట పెట్టమని కాదు ఇక్కడ చెప్పేది కష్టం గురించి తెలిసేలా పెంచండి.కష్టo, డబ్బు, సమయం, ఆరోగ్యం విలువ తెలియకపోతే.. వారికి జీవితం విలువ తెలియదు. ప్రేమతో, గారాబంగా మనం చేస్తున్న తప్పుల వలన కొందరు యువత 15 ఏళ్లకే ప్రేమ - దోమ అనటం,సిగరెట్స్, మందు, బెట్టింగ్, డ్రగ్స్, దొంగతనాలు, రేప్ లు, హత్యలు చేస్తున్నారు. మరికొంతమంది సోమరిపోతులా తయారవుతున్నారు. అభినయాలు కనపడడం లేదు, అణకువగా ఉండటం రాదు, సంస్కృతి, సంప్రదాయాలు పట్టించుకోవడం లేదు.. ఇలాగే ఉంటే కొంత కాలానికి తల్లి దండ్రులను గౌరవించే పద్ధతి కూడా లేకుండా పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.. భార్యకు వంట వండటం సరిగా రాదని నేటి యువత బిర్యానీలు, కర్రీ పాయింట్ ల వెంట పడుతూ చిన్న వయసులోనే గ్యాస్టిక్ అల్సర్, గాల్ బ్లాడర్ స్టోన్స్ , కిడ్నీ స్టోన్ ల బారిన పడుతున్నారు.. మరొక ఫ్యాషన్ ఏమిటంటే పెరుగు మజ్జిగ తీసుకుంటే వాంతులు చేసుకోవడం. కొన్ని ఆహార పదార్థాలు ఎంత ఆరోగ్యకరమైన కూడా వాళ్లకు అనవసరం. కాలేజీ పిల్లలయితే సరిగ్గా ఒక పిడికిలి పట్టేంత టిఫిన్, లంచ్ చిన్న బాక్సు రైస్.. చాలామంది ఫ్రూట్స్ అసలు తినరు. గర్భవతులైన తరువాత వారి బాధలు వర్ణనా తీతం. టోటల్ మెడిసిన్ మీద డిపెండ్ అవడం, 100 లో 90 మంది సిజేరియన్ ద్వారా పిల్లల్ని కంటున్నారంటే వారి శారీరక పటుత్వం ఎంత పడిపోయిందో ఆలోచించండి. అలా ఉంటే పుట్టే పిల్లలు కూడాఏదో ఒక జన్యులోపంతో పుడుతున్నారు.. 03వ తరగతి పిల్లాడికి సోడాబుడ్డి లాంటి కళ్ళద్దాలు. 05వ తరగతి వారికి అల్సర్, బీపీలు. 10 వ తరగతి దాటేలోపు ఎన్నో ఆరోగ్య సమస్యలొస్తున్నాయి.. వీటన్నికి కారణం మనం. మన పిల్లలను సరైన పద్ధతిలో పెంచక పోవడమే. అందుకే తల్లి దండ్రులు మారాలి. రేపటి సమాజానికి ఏమి నేర్పుతున్నామో ఒక్కసారి ఆలోచన చేయండి. సంస్కృతి సాంప్రదాయం అంటే ఏమిటి...? కేవలం గుడికి , దర్గా లకు వెళ్లి పూజలు, ప్రార్థనలు చేసి మన సంస్కృతి సాంప్రదాయం అని పిల్లలకు అలవాటు చేస్తున్నాము. అది మాత్రమే కాదు. సాంప్రదాయం అంటే అలా అనుకోవడం కొంత పొరపాటు..పిల్లలకు బాధ్యత,మర్యాద ,గౌరవం, కష్టం, నష్టం, ఓర్పు ,సహనం ,దాతృత్వం,ప్రేమ , అనురాగం, సహాయం, సహకారం ,నాయకత్వం ,మానసిక ద్రృఢత్వం ,కుటుంబ బంధాలు ,అనుబంధాలు,        దైవ భక్తి ,దేశ భక్తి కొంచెం కష్టమైనా సరే ఇవి తప్పక చిన్న వయసులోనే పిల్లలకు అలవాటు చేయాలి. మంది కోసం బ్రతకద్దు మన ఆరోగ్యం, మన ఆనందం కోసం బ్రతుకుదాం. ఇవన్ని అలవాటు అయితే ఆరోగ్యం, మానసిక పరిస్థితి, సామాజిక సృహ, ఉత్తమ జీవన విధానం వారికి అందించిన వారమవుతాం.. భావితరాల పిల్లల కోసం ,పిల్లలను మార్చే బాధ్యత మన అందరిపై కలదు. చదివిన వారందరికి విన్నపం. దయచేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి ఈ మేసేజ్ చదివి అందరూ మారిపోతారు అని నేను అనుకోవడం లేదు.కనీసం ఒక్కరు అయిన మారుతారని ఉద్దేశంతో ఈ మేసేజ్ పెడుతున్నాను

ఇట్లు మీ శ్రీనివాస నాయక్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఆలమూరు

Crimejournalist

Feb 19 2024, 17:24

గౌరారంపోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐ గా పదవీ బాధ్యతలు చేపట్టిన జె. శివకుమార్


పోలీస్ కమిషనర్ కు పూల బొక్కేను అందజేసిన గౌరారం నూతన ఎస్ఐ.జె.శివకుమార్


Streetbuzz News Crime journalis


(సిద్దిపేట జిల్లా );- వర్గల్ మండలం గౌరారం పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐ గా పదవీ బాధ్యతలు చేపట్టిన జె. శివకుమార్ ఈరోజు మర్యాదపూర్వకంగా పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్., అధికారి ని కలసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గారు అభినందించి శాంతి భద్రతలకు పెద్దపీట వేయాలని, సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి విధులు నిర్వహించాలని, గంజాయి డ్రగ్స్ ఇతర FC పదార్థాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని తెలిపారు. రాబోవు ఎంపీ ఎలక్షన్లో సందర్భంగా ముందస్తు ప్రణాళికలు తయారు చేసుకోవాలని సూచించారు.

Crimejournalist

Feb 19 2024, 12:15

చిన్నకోడూర్ ఎస్.ఐ ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సన్మానించిన వేకిల్ డ్రైవర్ అసోసియేషన్ సభ్యులు


రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించిన ఎస్.ఐ బాలకృష్ణ

  [ Streetbuzz News   Crime journalist]

తెలంగాణ:

సిద్దిపేట జిల్లా:

(చిన్నకోడూర్ ): - మండల లైట్ మోటార్ వేకిల్ డ్రైవర్ అసోసియేషన్ సభ్యులు ఈ రోజు స్థానిక ఎస్ఐ. జి. బాలకృష్ణ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సన్మానించారు ఈ సందర్భంగా ఎస్.ఐ బాలకృష్ణ డ్రైవింగ్ లో పాటించాల్సిన జాగ్రత్తలపైన పలు సూచనలు చేస్తూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని మద్యం సేవించి వాహనాలు నడుపకూడదని అదేవిదంగా మితిమీరిన వేగంతో వాహనాలు నడిపి ప్రమాదాలు కొనితెచుకోవద్దని సూచించారు.

Crimejournalist

Feb 19 2024, 08:11

శ్రీ వెంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మార్క అనిల్ గౌడ్



కరీంనగర్ జిల్లా:

[ Streetbuzz News Crime journalist ]


(కరీంనగర్ ):- కరీంనగర్ పట్టణంలో బీసీ మరియు రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో భాగంగా స్వామివారిని దర్శించుకున్న మార్క అనిల్ గౌడ్. ఈ సందర్భంగా కరీంనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మరియు ఇన్చార్జ్ పురమండ్ల శ్రీనివాస్ గార్లు స్వామి వారి కండువాను వారికి కప్పారు.